Skip to content

A SONG

చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చె దూతలేమో పొగడ వచ్చె పుట్టాడు పుట్టాడురో రారాజు మెస్సయ్యా పుట్టాడురో మన కోసం (2) పశుల పాకలో పరమాత్ముడు సల్లని సూపులోడు సక్కనోడు ఆకాశమంత మనసున్నోడు నీవెట్టివాడవైనా నెట్టివేయడు (2) సంబరాలు సంబరాలురో మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి|| చింతలెన్ని ఉన్నా చెంత చేరి చేరదీయు వాడు ప్రేమగల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరవనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు (2) సంబరాలు సంబరాలురో మన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి||